దేశంలో 28మందికి కరోనా: హర్షవర్ధన్‌
close
Updated : 04/03/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో 28మందికి కరోనా: హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యలు  తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు, ముందస్తుచర్యలు చేపట్టాం. విదేశాల నుంచి వచ్చే వారికి  విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేస్తున్నాం.  కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఉండే ప్రదేశాలను శుభ్రం చేయించాం. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల వరకు శుభ్రత చర్యలు చేపట్టాం. దిల్లీలో మరిన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు సంఖ్య పెంచాలని ఆదేశించాం. ఇరాన్‌లో కూడా ఒక ల్యాబ్‌ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. ఇరాన్‌ నుంచి వచ్చే వారికి అక్కడే పరీక్షలు చేసి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నాం. ఇటలీ నుంచి వచ్చిన బృందంలో ఒకరికి కరోనా  కరోనా పాజిటివ్‌ వచ్చింది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

28 మందికి కరోనా వైరస్‌

దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దిల్లీలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఆగ్రాలో నివసిస్తున్న ఆరుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పేర్కొన్నారు. కేరళలో 3, దిల్లీలో 1, తెలంగాణలో ఒకటి, 16 మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్‌కు కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులను ఐటీబీపీ క్యాంప్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఇప్పటి వరకూ 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం అందిందని, అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందన్నారు. విదేశీయులు వెనక్కి వెళ్లాలన్నా ఆయాదేశాలు రానివ్వడం లేదని, అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని తెలిపారు. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని