దిల్లీ టు బిహార్‌: 1200 కి.మీ. రిక్షాలో..!
close
Published : 19/05/2020 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ టు బిహార్‌: 1200 కి.మీ. రిక్షాలో..!

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలు వర్ణించలేనివి. పనికోసం పట్టణానికి వస్తే, పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాలినడకన తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నా ఇంకా కాలినడకన వెళ్లే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అలా దిల్లీ నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక రిక్షాలో బిహార్‌కు బయలుదేరారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1200 కి.మీ. వాళ్లు రిక్షాలో ప్రయాణించనున్నారు.

బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్‌ మరో ఇద్దరు వలస కూలీలతో కలిసి దిల్లీ నుంచి బిహార్‌కు రిక్షాలో బయలు దేరాడు. ‘దిల్లీ నుంచి లఖ్‌నవూ చేరుకోవడానికి మాకు అయిదు రోజులు పట్టింది. ఇక్కడి నుంచి ఖగారియా మరో 700కి.మీ. ఉంది. మండుటెండలో రిక్షా తొక్కి తొక్కి అలసిపోయాం. ఇంతకుమించి మాకు మరో మార్గం లేదు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి మా పరిస్థితి దారుణంగా ఉంది. అన్నం కోసం ఎన్నో తిప్పలు పడ్డాం. ప్రైవేటు బస్సులు, ట్రక్‌ డ్రైవర్లను అడిగితే రూ.5వేలు అవుతుందని చెప్పారు. అంత సొమ్ము మా దగ్గరలేదు. ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి సాయం అందలేదు. మా సొంతూరు చేరుకోవడానికి మరో వారం పడుతుంది’’ అని రంజిత్‌ తన ప్రయాణ దీన గాథను వివరించాడు.

రంజిత్‌తో పాటు, అజయ్‌కుమార్‌, గుడ్డులు కూడా బిహార్‌కు రిక్షాలో వెళ్తున్నారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు రిక్షా తొక్కుతూ గమ్యం దిశగా పయనమవుతున్నారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దిల్లీలో మాకు ఎలాంటి సాయం లభించలేదు. మాలాంటి పేదలను ప్రభుత్వం పట్టించుకోలేదు. డబ్బులు పెట్టుకుని సొంతూరు వచ్చే స్తోమత మాకు లేదు. ఖగారియాలో నాకు పని దొరుకుతుందాదో? లేదో తెలియదు. కానీ, నా కుటుంబంతో నేను ఉంటాను. దిల్లీ నుంచి 120 కి.మీ. నడిచిన తర్వాత రిక్షాలో వెళ్తున్న వీళ్లు నాకు కనిపించారు. నాది కూడా బిహార్‌ కావడంతో వాళ్లతో వచ్చేందుకు ఒప్పుకొన్నారు. అలా ముగ్గురం కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం’’ అని అజయ్‌ చెప్పుకొచ్చాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని