వైరస్‌ను మించిన ‘డెత్‌స్క్వాడ్‌’లు
close
Updated : 22/05/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ను మించిన ‘డెత్‌స్క్వాడ్‌’లు

బలోచిస్థాన్‌లో మారని పాక్‌సైన్యం తీరు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కశ్మీర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి భారత సైన్యం ఇంటర్నెట్‌ వేగాన్ని తగ్గిస్తే పాకిస్థాన్‌ భోరున ఏడ్చేది. కానీ, ఇటీవల పాక్‌లో ఉన్నట్లుండి ఇంటర్నెట్‌ వేగం మందగించింది.. ఓ సోషల్‌ మీడియా లైవ్‌ స్ట్రీమింగ్‌, మరో వీడియో స్ట్రీమింగ్‌ యాప్ కొన్నిగంటలపాటు పనిచేయడం మానేశాయి. ఆరా తీస్తే పాక్‌ ప్రభుత్వం వాటిని కొన్ని గంటలపాటు బ్లాక్‌ చేసినట్లు నెట్‌అబ్జర్వేటరి.వోఆర్‌జీ పేర్కొంది. ఆ సమయంలో ‘సాత్‌’అనే ఒక సంఘం వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశంలో బలోచిస్థాన్‌లో జర్నలిస్టు సాజిద్‌ హుస్సేన్‌ హత్యపై చర్చించనున్నారు. సాజిద్‌ బలోచ్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బలోచ్‌ ఉద్యమాన్ని పాకిస్థాన్‌ ఏ స్థాయిలో అణగదొక్కుతోందో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ. 

కరోనావైరస్‌ విజృంభించిన సమయంలో బలోచిస్థాన్‌లో  డెత్‌స్క్వాడ్స్‌ చెలరేగిపోతున్నాయి. ఇవి పేరుకు మాత్రమే ప్రైవేటు సైన్యాలైనా.. ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఉగ్రసంస్థ లష్కరే తోయిబాతో దీనికి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఈ బృందాలు పౌరులను, బలోచ్‌ ఉద్యమకారులను హత్యలు చేస్తుంటాయి. వీటికి పాక్‌ ఐఎస్‌ఐ సహాయం చేస్తోంది. పక్కా నేరగాళ్లను ఎంచుకొని ఈ  బృందాలను తయారు చేస్తుంది. వీరికి అవసరమైన ఆయుధాలను సమకూర్చడంతో పాటు.. వీరు చేసే నేరాలకు కొమ్ముకాస్తుంది. ఇక డెత్‌స్క్వాడ్‌లకు మద్దతుగా అవసరమైన ప్రచార కార్యక్రమాన్ని చేస్తుంటుంది. ఆర్మీ అధికారులకు అక్రమంగా డబ్బు సమకూరుస్తుంటుంది.. ల్యాండ్‌ మాఫియా వ్యవహారాలు చక్కబెడుతుంది.  

ఇటీవల ఎలా బయటకు పొక్కింది..?

మే8వ తేదీన దక్షిణ బలోచిస్థాన్‌లోని కెచ్‌ జిల్లాలో ఐఈడీ పేలి 6గురు పాక్‌ జవాన్లు చనిపోయారని పాక్‌ సైన్యం ప్రకటించింది. వీరిలో మేజర్‌ నదీం అబ్బాస్‌ కూడా ఉన్నారని చెప్పింది. అప్పటికే నదీం ఒక ప్రైవేటు సైన్యంతో కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి.  ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో హెచ్‌అండ్‌కే జీ3, హెచ్‌ అండ్‌ కే ఎంపీ5 రైఫిల్స్‌ ఉన్నాయి. వీటిని పాక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. కానీ,  ఈ దాడిలో మరో ముగ్గురు యువకులు చనిపోయిన విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టింది. వాళ్లు నదీం తయారు చేసిన డెత్‌స్క్వాడ్‌ సిబ్బంది..!  సాధారణ పౌరులు చనిపోతే పాక్‌ సైన్యం దానిని భూతద్దంలో చూపించేది.. కానీ, చనిపోయిన వారు డెత్‌స్క్వాడ్‌ సభ్యులు కావడంతో ఏమీ చేయలేక ఊరుకొంది. 

డెత్‌స్క్వాడ్‌ నుంచి రాజకీయాల్లోకి..!

పాక్‌లోని డెత్‌స్క్వాడ్‌లలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి షఫీక్‌ మెంగల్‌. ఇతనికి లష్కరే, కశ్మీరీ జిహాదీతో సంబంధాలు ఉండేవి. పాక్‌లోని ఖుజుదార్‌ అనే ప్రదేశంలో ప్రైవేటు జైళ్లను నడిపేవాడు. 2014లో ఇతను టూటక్‌ అనే ప్రదేశం వద్ద నడిపే ఒక ప్రైవేటు జైలు సమీపంలో సామూహిక సమాధులు బయటపడ్డాయి. వాధ్‌లో ఉగ్రక్యాంపులను కూడా నిర్వహిస్తుంటాడు. ఇతను రాజకీయాల్లోకి వెళ్లడంతో జకీరా మహమ్మద్‌ హుస్సేని ఈ స్థానాన్ని ఆక్రమించాడు. వీరితోపాటు ఫయాజ్‌ జంగ్వీ, యూనిస్‌ మహమ్మద్‌ షాలు కూడా డెత్‌స్క్వాడ్లను నిర్వహిస్తున్నారు. ఒక్క ఏప్రిల్‌ నెలలలోనే బలోచిస్థాన్‌లో 45 కిడ్నాప్‌లు జరిగాయి. వీటి వెనుక వీరి హస్తం ఉంది. ఇటీవల చనిపోయిన జర్నలిస్టు  సాజిద్‌ హుస్సేన్‌, అతని కుటుంబ మిత్రుల హత్యల్లో డెత్‌స్క్వాడ్‌ల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టును చంపడంలో పాక్‌ సైన్యం  పాత్రకూడా ఉన్నట్లు సమాచారం. గతేడాది  పాక్‌లోని జియో టీవీకి చెందిన హమీద్‌ మీర్‌ అనే జర్నలిస్టును సైన్యం మాయం చేసింది.  ఈవిషయాన్ని ఒక ప్రెస్‌మీట్‌లో డీజీఐఎస్పీఆర్‌ ఆసీఫ్‌ గఫూర్‌ అంగీకరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని