‘కట్టడి సాధ్యమే.. ధారావే ఉదాహరణ’
close
Updated : 11/07/2020 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కట్టడి సాధ్యమే.. ధారావే ఉదాహరణ’

WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌

జెనీవా: కరోనా ఉగ్రరూపంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. గత ఆరు వారాల్లోనే కేసులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడం ఇప్పటికీ సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ఇందుకు భారత్‌లోని అతిపెద్ద మురికివాడ ధారావిని ఒక ఉదాహరణగా  సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొని అక్కడ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు.

ఇటలీ,స్పెయిన్‌, దక్షిణకొరియా, ధారావిల్లో గతంలో కొవిడ్‌ ఉద్ధృతి దారుణంగా ఉన్నప్పటికీ.. సరైన చర్యల ద్వారా అక్కడ వైరస్‌వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకువచ్చారని అధనోమ్‌ పేర్కొన్నారు. జెనీవాలో జరిగిన ఓ వర్చ్యువల్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

‘గత ఆరువారాల్లో ప్రపంచవ్యాప్తంగా కేసులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ దానిని నియంత్రణలోకి తీసుకురాగలమని ప్రపంచవ్యాప్తంగా చాలా ఉదాహరణలు మనకు చూపిస్తున్నాయి. వీటిలో ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా, ముంబయిలోని ధారావి ఉన్నాయి. అతి పెద్ద మురికివాడ ధారావిలో..  వైరస్‌ గొలుసును తుంచివేయడానికి  టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌, ట్రీటింగ్‌లాంటి చర్యలు చేపట్టారు’ అని ట్రెడోస్‌ వివరించారు. నిబంధనల సడలింపులతో కేసుల సంఖ్య పెరగడాన్ని మనం చూస్తున్నామని.. జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారానే ఈ మహమ్మారిని నిలువరించగలమని పేర్కొన్నారు. 

శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.24 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 5.5 లక్షలు దాటింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని