మొక్కలతో మానసికానందం!
close
Published : 09/10/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొక్కలతో మానసికానందం!

మనం నాటిన చిన్న విత్తనం నుంచి భూమి పొరలను చీల్చుకుని రెండాకులు బయటకు వస్తే... ఎంత ఆనందంగా ఉంటుందో కదా!  మొక్కల్ని పెంచడంవల్ల ఆనందమే కాదు, ఆరోగ్యమూ పెరుగుతుంది.

మొక్కల మధ్య గడపడంవల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఆరోగ్యంగా ఉండగలగుతారు. మీరు నాటిన మొక్కలు పెరిగి పెద్దవవుతుంటే మీలో నూతనోత్తేజం వస్తుంది.
* రోజూ మొక్కలకు నీళ్లు పోయడం, అప్పుడప్పుడూ ఎరువులు వేయడం, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం... లాంటి పనులతో శారీరక శ్రమ చేస్తారు. దాంతో వ్యాయామం చేయడంవల్ల వచ్చే ఫలితాల్ని పొందవచ్చు.
* మొక్కలను పెంచడంవల్ల వాటితో సావాసం చేస్తూ ఆరుబయట ఎక్కువ సమయం గడుపుతారు. దాంతో ఎండ తగిలి శరీరానికి తగినంత విటమిన్‌-డి అందుతుంది. ఇది మీ శరీరంలోని క్యాల్షియం స్థాయుల్ని పెంచుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
* తోటపని చేయడంవల్ల వయసుతోపాటు వచ్చే మతిమరుపును నియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
* మొక్కల పెంపకంతో మానసికానందం మీ సొంతమవుతుంది. మీ చేతులతో స్వయంగా నాటిన మొక్కలు మీకెంతో ఆప్తుల్లా.. ఒంటరితనాన్ని దూరం చేసే నేస్తాల్లా కనిపిస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని