ఆడిస్తాయి.. జో కొట్టేస్తాయి
close
Published : 24/04/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడిస్తాయి.. జో కొట్టేస్తాయి

పాపాయిని నిద్రపుచ్చడం తల్లులకు పెద్ద సవాలే. భుజంపై వేసుకునో,.. ఊయలలో వేసి ఊపుతూనో నిద్ర పుచ్చుతుంటారు. దీంతో అమ్మలకు నిద్ర కరవవుతుంది. పగటి సమయంలోనైనా మాంచి కునుకులో ఉన్నారులే ఏదైనా పని చేద్దామని అని అలా పక్కకు వెళ్లగానే... రాగాలు తీస్తుంటారు. ఇలాంటి బుజ్జాయిల కోసమే రూపొందించారు రాకింగ్‌ చెయిర్‌లు. మెత్తనైన కుషన్‌, సీట్‌ బెల్ట్‌తో వస్తాయి. కాబట్టి పడి దెబ్బలు తగిలించుకునే అవకాశముండదు. బేబీ కదలగానే నెమ్మదిగా ఊగుతాయి. వీటిలో కొన్ని బ్లూటూత్‌తోనూ పనిచేస్తాయి. బొమ్మలను తగిలించుకునే వీలూ ఉంటుంది. ఎత్తులను మార్చుకునే, ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా కూడా రూపొందించారు. 0-7 నెలల వారి వరకూ ఇవి ఉపయోగపడతాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని