ద్రాక్ష.. ఆరోగ్య రక్ష..
close
Published : 10/05/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్రాక్ష.. ఆరోగ్య రక్ష..

ద్రాక్షలందు నల్లద్రాక్ష వేరయా అంటున్నారు వైద్యులు. మరి వాటిని తింటే ఏం ఉపయోగాలున్నాయో చూద్దాం రండి.
* నల్ల ద్రాక్షలో విటమిన్‌ ఎ, సి, బి6, ఫోలిక్‌ ఆమ్లం, గ్లూకోజ్‌, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలున్నాయి. కాబట్టి ఇవి తినడం వల్ల రక్తపోటు, గుండెజబ్బులు, ఊబకాయం వంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
* శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి ముఖంలోని వృద్ధాప్య ఛాయలను తొలగించి యౌవనంగా ఉండేందుకు తోడ్పడతాయి.
* వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. ద్రాక్ష పండులో రెస్వరెటాల్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిని పెంచుతుంది. తద్వారా శరీరంలోని చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది. నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకునే చెడు కొవ్వును తగ్గించి, సమస్యలు రాకుండా కాపాడతాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని