Payal Rajput: కుంగుబాటుకు లోనయ్యా - i feel depressed and crying out loud
close
Published : 19/05/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Payal Rajput: కుంగుబాటుకు లోనయ్యా

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు నటి పాయల్‌ రాజ్‌పూత్‌ తెలిపారు. కొవిడ్‌ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయానని.. ఎంతో బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాయల్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో దారుణంగా మారాయని.. అందరూ ఇంటికే పరిమితమై తమ ప్రియమైన వారిని సంరక్షించుకోవాలని ఆమె సూచించారు.

‘‘ఇదే నా జీవితంలో అతి క్లిష్టమైన దశ. ఎంతో ఆందోళనగా ఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నాను’’ అని పాయల్‌ పోస్ట్‌ పెట్టారు. మరోవైపు, తనకెంతో ఆప్తురాలైన అనితా ఆంటీ కొవిడ్‌-19 కారణంగా కన్నుమూశారని ఇటీవల పాయల్‌ తెలియజేశారు. ఆమె మరణవార్త తనని ఎంతగానో కలచి వేసిందన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని