నేను కరోనా బారిన పడలేదు: అంజలి - i have not tested for positive for covid anjali
close
Published : 08/04/2021 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను కరోనా బారిన పడలేదు: అంజలి

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వైరస్‌ రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అయితే ‘వకీల్‌సాబ్‌’ నటి అంజలికి కరోనా వచ్చిదంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలపై నటి అంజలి ట్వీటర్‌ వేదికగా స్పందిస్తూ...‘‘నా శ్రేయేభిలాషులకు నమస్కారం. నాకు కొవిడ్ రాలేదు. చాలా మీడియా మాధ్యమాలలో నేను కరోనా వైరస్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు వైరస్ సోకలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ పేర్కొంది. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ‘వకీల్‌సాబ్’ ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని