ఆ బిల్డింగ్‌ను భూస్థాపితం చేస్తా: చిరంజీవి - if megastar could rewind his life sam jam
close
Updated : 04/01/2021 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ బిల్డింగ్‌ను భూస్థాపితం చేస్తా: చిరంజీవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదేంటి మెగాస్టార్‌ చిరంజీవి బిల్డింగ్‌ను భూస్థాపితం చేస్తానన్నారా..? అని కంగారు పడకండి. ఆయన ఆ వ్యాఖ్యలు చేసింది చెడు ఉద్దేశంతో కాదులేండి. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో సమంత వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘సామ్‌జామ్‌’ కార్యక్రమంలో చిరు అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగా చిరును సమంత ఓ ప్రశ్న అడిగింది. ‘జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే మీరు దేన్ని మార్చాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించగా.. దానికి చిరు తెలివిగా సమాధానం చెప్పారు.

‘ఒకవేళ నిజంగానే ఆ అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి చైనాలో కరోనా వైరస్‌ లీక్‌ అయిన బిల్డింగ్‌ను భూస్థాపితం చేసి ఆ వైరస్‌ను బయటికి రాకుండా చేయాలనేది నా కోరిక’ అని మెగాస్టార్‌ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని ‘ఆహా’లో వీక్షించవచ్చు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించనున్నారు. ఆ తర్వాత మెగాస్టార్‌ ‘లూసిఫర్‌‌’లో నటించనున్నారు.

ఇదీ చదవండి..

‘సామ్‌జామ్‌’కు నాగచైతన్య
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని