చైనా నుంచే నేర్చుకుంటాం: పాకిస్థాన్‌ - imran khan says his govt wants to learn from china
close
Published : 01/01/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా నుంచే నేర్చుకుంటాం: పాకిస్థాన్‌

డ్రాగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: చైనాపై ఉన్న అభిమానాన్ని పాకిస్థాన్‌ సమయం దొరికినప్పుడల్లా బహిరంగంగానే వ్యక్తపరుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా అభివృద్ధి విధానంపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏదైనా దేశం నుంచి అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాలనుకుంటే అది కేవలం ఒక్క చైనా నుంచి మాత్రమే నేర్చుకుంటామని స్పష్టంచేశారు.

‘ప్రపంచంలో ఏదైనా దేశం నుంచి నేర్చుకోవాలనుకుంటే, అది ఒక్క చైనా నుంచే నేర్చుకోవాలి. వారి అభివృద్ధి విధానం పాకిస్థాన్‌కు ఎంతో అనుగుణంగా ఉంటుంది. గడిచిన మూడు దశాబ్దాల్లో చైనా సాధించిన పురోగతి నుంచి తామెంతో నేర్చుకోవాలి’ అని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టంచేశారు. అంతేకాకుండా పేదరిక నిర్మూలనే నిజమైన అభివృద్ధి అనే విషయాన్ని బీజింగ్‌ నిరూపించిందని పాక్‌ ప్రధాని కొనియాడారు. పరిశ్రమల వృద్ధి, ప్రత్యేక ఎగుమతి జోన్లు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి వ్యూహాలతో చైనా సంపదను సృష్టిస్తోందని అన్నారు. అలా వచ్చిన డబ్బును అక్కడి పేదరిక నిర్మూలనకు వినియోగిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక చైనా కంపెనీలను ఆకర్షించేందుకు పాకిస్థాన్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తామని..అక్కడి నుంచే పాకిస్థాన్‌కు ఎగుమతులు చేయనున్నట్లు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. ప్రస్తుత సంవత్సరం దేశంలో పారిశ్రామికాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇక కరోనా కారణంగా 2020లో పాకిస్థాన్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ఇమ్రాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌లో 4లక్షల 82వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక చైనా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు కూడా పాకిస్థాన్‌లోనూ కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి..
పాక్‌ను ఇప్పుడేమనాలి..!
విదేశీ కంపెనీల్లో డ్రాగన్‌ ఊడలు..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని