టీమ్‌ఇండియా టార్గెట్‌ 165  - india target 165 in second t20 against england
close
Updated : 14/03/2021 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా టార్గెట్‌ 165 

శార్ధూల్‌, సుందర్‌ చెరో రెండు వికెట్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. టీమ్‌ఇండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఓవర్‌లోనే జాస్‌ బట్లర్‌(0)ను భువనేశ్వర్‌ డకౌట్‌ చేశాడు. తర్వాత ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(46; 35 బంతుల్లో 4x4, 2x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌(24; 23 బంతుల్లో 4x4) ధాటిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్‌ విడదీశాడు. ఓ చక్కటి బంతితో మలన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోర్‌ 64/2గా నమోదైంది. తర్వాత బెయిర్‌స్టో(20; 15 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి రాయ్‌ మరింత రెచ్చిపోయి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, అర్ధశతకానికి చేరువైన అతడిని వాషింగ్టన్‌ సుందర్‌ బోల్తా కొట్టించాడు. ఆపై బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్‌(28; 20 బంతుల్లో 4x4) బౌండరీలు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వాషింగ్టన్‌ సుందర్‌.. బెయిర్‌స్టోను, శార్ధూల్‌ ఠాకుర్‌.. మోర్గాన్‌ను పెవిలియన్‌ పంపారు. చివర్లో బెన్‌స్టోక్స్‌(24), సామ్‌ కరన్‌(6) ధాటిగా ఆడి జట్టు స్కోరును 164/6కి తీసుకెళ్లారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని