రజనీకాంత్‌ చిత్రంలో జగపతిబాబు  - jagapathi babu to play rajinikanth annaatthe movie
close
Published : 17/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీకాంత్‌ చిత్రంలో జగపతిబాబు 

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నారు.  తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విటర్‌లో పేర్కొంది. జగపతిబాబు తమిళ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన రజనీకాంత్‌తో కలిసి ‘కథానాయకుడు’, ‘లింగ’ చిత్రాల్లో నటించారు.

గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టగా, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవల చెన్నైలో షూటింగ్‌ మొదలు కాగా, కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తోన్న  ఈ సినిమా నవంబర్‌ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని