కరోనా జపాన్‌ వెర్షన్‌! - japanese health ministry finds new virus variant
close
Updated : 11/01/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా జపాన్‌ వెర్షన్‌!

బ్రిటన్‌, దక్షిణాఫ్రికా వేరియంట్ల కంటే భిన్నమైన వైరస్‌

టోక్యో: ఓవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటుంటే.. వెలుగులోకి వస్తున్న కరోనా వైరస్‌ కొత్త రకాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న మహమ్మారిని గుర్తించారు. తాజాగా జపాన్‌లో వీటన్నింటికీ భిన్నమైన మరో వైరస్‌ను నిర్ధారించారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు జపాన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు జపాన్‌ ఈ విషయాన్ని  తెలియజేసింది. దీనిపై సమగ్ర జన్యువిశ్లేషణ జరపాలని కోరింది. అలాగే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఏ మేర ప్రభావం చూపుతాయో తెలపాలని కోరింది. వైరస్‌ గుర్తించిన వ్యక్తుల్లో తొలుత ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. కానీ, క్రమంగా ఓ వ్యక్తికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు జరిపారు. కరోనా కొత్త రకం అని నిర్ధారణ అయింది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా వేరియంట్ల కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. మరో వ్యక్తిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి.

జపాన్‌లో ఇప్పటి వరకు 30 మందిలో బ్రిటన్‌, దక్షిణాఫ్రికా వేరియంట్లను గుర్తించారు. కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. టోక్యో నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక ఆ దేశంలో ఇప్పటి వరకు 2,80,000 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 4000 మంది మరణించారు.

ఇవీ చదవండి..

టీకా పంపిణీలో సవాళ్లు

18 నుంచి 1400 కేంద్రాల్లో టీకామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని