టైగర్‌ కోసం కత్రినా ప్రత్యేక శిక్షణ - katrina kaif preparation for tiger 3
close
Published : 05/03/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌ కోసం కత్రినా ప్రత్యేక శిక్షణ

ముంబయి: యాక్షన్‌ సన్నివేశాలు చేయడం కత్రినాకైఫ్‌కు ఏమీ కొత్త కాదు. ఆమె శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది. నిత్యం కొత్త కొత్త వర్కవుట్లు చేస్తుంది. సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంట తెరపై ఎలా ఉంటుందో  అభిమానులు పలు   సినిమాల్లో చూశారు. ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’.

టైగర్‌ సిరీస్‌ వస్తోన్న ఈ చిత్రమూ యాక్షన్‌ సన్నివేశాలే కీలకంగా   సాగనుంది. అందులో భాగంగానే కత్రినా ప్రత్యేక కసరత్తులు చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 14 రోజుల పాటు దక్షిణ కొరియా స్టంట్‌ కళాకారుల నేతృత్వంలో శిక్షణ తీసుకోనుందట. మనీష్‌ శర్మ తెరకెక్కించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముంబయిలో మొదలుకానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని