వాళ్లు చాలా అందంగా ఉంటారు.. నీకు ఏమైంది? - keerthy sister revathy as she opens up on being ridiculed for her weight in a long note
close
Published : 17/02/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు చాలా అందంగా ఉంటారు.. నీకు ఏమైంది?

ఎంతోమంది నన్ను ఎగతాళి చేశారు: రేవతి

హైదరాబాద్‌: బరువు కారణంగా ఒకానొక సమయంలో తాను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటి మేనక పెద్ద కుమార్తె, కీర్తి సురేశ్‌ సోదరి రేవతి తెలిపారు. ఒకానొక సమయంలో భారీకాయంతో అభద్రతభావానికి గురైన రేవతి యోగాతో బరువు తగ్గానని.. మానసికంగా దృఢంగా మారానని వెల్లడించారు. తరచూ సాధారణమైన ఫొటోలు, పోస్టులతో నెట్టింట్లో యాక్టివ్‌గా ఉండే రేవతి తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

‘శరీర బరువు కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను మానసికంగా పోరాటం చేశాను. అందం, శరీరాకృతి విషయంలో అమ్మ, సోదరితో పోలుస్తూ చాలామంది నన్ను ఎగతాళి చేసేవాళ్లు. బరువు కారణంగా టీనేజీలో ఉన్నప్పుడు అభద్రతాభావానికి గురయ్యాను. అమ్మ, చెల్లి మాదిరిగా అందంగా లేనని నాలో నేను నచ్చచెప్పుకునేదాన్ని. నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆలోచించేదాన్ని. ఒకానొక సమయంలో నా భర్త నాకు ప్రపోజ్‌ చేయగానే.. ‘అసలు ఇతను నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాడో’ అని షాక్‌ అయ్యాను. ఓరోజు ఓ పెద్దావిడ.. ‘మీ అమ్మ, చెల్లి చాలా అందంగా ఉంటారు. నీకు ఏమైంది?’ అని అడిగింది. నాకెంతో బాధగా అనిపించింది. చివరికి నేను యోగాతో బరువు తగ్గాను. యోగా వల్ల నాలో ఉన్న బలాన్ని తెలుసుకోగలిగాను. ఈ మొత్తం ప్రయాణంలో అమ్మ, కీర్తి నన్ను ప్రోత్సాహిస్తూనే ఉన్నారు.’ అని రేవతి వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని