కోహ్లీ.. విశ్వాసం ఉంచడంలో మేటి - kohli gives a lot of confidence on bowlers
close
Published : 03/10/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ.. విశ్వాసం ఉంచడంలో మేటి

(Twitter/Yuzi)

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అన్నాడు. తమ బౌలింగ్‌కు అనుగుణంగా ఫీల్డింగ్‌ పెట్టుకొనేందుకు స్వేచ్ఛనిస్తాడని ప్రశంసించాడు. ఆటగాళ్లు నాయకుడి నుంచి కోరుకొనేది అదేనని వెల్లడించాడు.

యూఏఈలో జరుగుతున్న లీగులో మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు రెండు విజయాలు సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో చాహల్‌ కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిసాడు. బ్యాట్స్‌మెన్‌ సిక్సర్లు బాదే అవకాశమున్నా రిస్క్‌ తీసుకొనేందుకు వెనుకాడడు. లీగులో అతడు ఇప్పటి వరకు 105 వికెట్లు తీయడం గమనార్హం.

‘ఆరేళ్లుగా బెంగళూరుకు ఆడుతున్నా. విరాట్‌ భయ్యా ఎప్పుడూ నాపై విశ్వాసంతోనే ఉంటాడు. నా బౌలింగ్‌కు నేనే సారథినని అంటాడు. అందుకే నాకు ఎలాంటి ఫీల్డింగ్‌ అవసరమైతే అలాగే ఫీల్డర్లను మోహరించేందుకు అనుమతి ఇస్తాడు. ఒకవేళ అది పనిచేయకపోతే ఆప్షన్‌-బికి వెళ్తాం. బౌలరైనా, యువకుడైనా.. కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసం నింపుతాడు’ అని చాహల్‌ అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని