గృహిణులందరికీ పింఛన్‌ - ldf releases manifesto
close
Published : 19/03/2021 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహిణులందరికీ పింఛన్‌

కేరళలో ఎల్డీఎఫ్‌ ఎన్నికల మేనిఫెస్టో

తిరువనంతపురం: కేరళలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి ప్రజలపై హామీల వర్షం కురిపించింది. గృహిణులందరికీ పింఛన్‌, యువతకు 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. పింఛన్‌ హామీకి సంబంధించి పూర్తి విరాలను మాత్రం తెలియజేయలేదు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ రాఘవన్‌ మేనిఫెస్టోను శుక్రవారం  విడుదల చేశారు. సీపీఐ కార్యదర్శి కన్నన్‌ రాజేంద్రన్‌, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న సామాజిక పింఛన్లను దశలవారీగా రూ.2,500కు పెంచుతామని ఎల్డీఎఫ్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. లైఫ్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ కింద పేదలందరికీ మరిన్ని ఇళ్లు కట్టిస్తామని, ఎస్సీ, ఎస్టీలందరికీ నివాస సముదాయాలు కట్టిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా రూ.5వేల కోట్లతో కోస్టల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్యాకేజీని ప్రకటిస్తామని పేర్కొంది. రబ్బర్‌కు మద్దతు ధరను కేజీకి రూ.250కి పెంచుతామని హామీ ఇచ్చింది. రాష్ట్రానికి సరిపడా గుడ్లు, పాలు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఐదేళ్లలో అవినీతి రహిత  పాలన అందించడం ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ సందర్భంగా విజయ్‌ రాఘవన్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని