‘ఆర్‌సీ 15’కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయనున్న వివేక్? - lyricist vivek roped into pen screenplay dialogues for ram charan shankar rc 15
close
Published : 30/04/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌సీ 15’కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయనున్న వివేక్?

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ 15’ వర్కింగ్‌ టైటిల్‌పై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి ప్రముఖ తమిళ పాటల రచయిత వివేక్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించనున్నారని సమాచారం. వివేక్‌ గతంలో రజనీకాంత్‌ నటించిన ‘దర్బార్‌’, ‘పేట్ట’, విజయ్‌ హీరోగా చేసిన ‘బిగిల్‌’, ‘సర్కార్‌’ వంటి తమిళ సినిమాలకు సాహిత్యం సమకూర్చారు. ప్రస్తుతం ధనుష్‌ నటించిన ‘జగమే తంత్రం’ చిత్రానికి తమిళంలో పాటలు రాశారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఆర్‌సీ 15’ చిత్రంలో కథానాయికగా కియారా అడ్వాణీ తీసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శంకర్ చిత్రాన్ని తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన అల్లూరి సీతారామరాజుగా చేస్తుండగా.. సీతగా బాలీవుడ్ నటి అలియా భట్‌ నటిస్తోంది.   మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని