close
Published : 11/04/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వకీల్‌ సాబ్‌’కు మహేశ్‌బాబు ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంపై నటుడు మహేశ్‌బాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ మహేశ్‌ ట్విటర్‌లో ప్రశంసించారు. ‘‘వకీల్‌ సాబ్‌లో లాయర్‌గా పవన్‌ కల్యాణ్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ నటన చాలా శక్తివంతంగా ఉంది. ప్రకాశ్‌రాజ్‌ గొప్ప ప్రతిభాశీలి. నివేదా థామస్‌, అంజలి, అనన్యలు హృదయాన్ని హత్తుకునేలా నటించారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. చిత్ర బృందానికి అభినందనలు’’ అంటూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.
వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన  ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజ్‌ నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని