Seetimaar: ‘రాధే’ సీటీమార్‌ మేకింగ్‌ చూశారా? - making video of salmankhan seetimaar
close
Updated : 28/04/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Seetimaar: ‘రాధే’ సీటీమార్‌ మేకింగ్‌ చూశారా?

సల్మాన్‌ దేనికీ నో చెప్పలేదు: ప్రభుదేవా

ముంబయి: సల్మాన్‌ఖాన్‌, దిశాపటానీ జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాధే’. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘రాధే’ నుంచి ‘సీటీమార్‌’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో సల్మాన్‌ డ్యాన్స్‌ చూసి ఆయన అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, బుధవారం ‘సీటీమార్‌’ మేకింగ్‌ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌కేఎఫ్‌ (సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌) నెట్టింట్లో షేర్‌ చేసింది. పాట చిత్రీకరణ సమయంలో తమకున్న అనుభవాలను సల్మాన్‌, దిశాతోపాటు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా అందరితో పంచుకున్నారు. ‘ఏ స్టెప్పు చెప్పినా సరే సల్మాన్‌ నో చెప్పలేదు. మేము చెప్పిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ని ఆయన ఇష్టంతో చేశారు’ అని ప్రభుదేవా తెలిపారు. ‘సీటీమార్‌’ మేకింగ్‌ వీడియోని మీరూ చూసేయండి.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని