Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌస్‌మేట్స్‌కు నాగ్‌ వార్నింగ్‌! - mega powerstar ramcharan on the bigg boss telugu5 stage
close
Updated : 18/09/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌస్‌మేట్స్‌కు నాగ్‌ వార్నింగ్‌!

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇటీవల మొదలైన ‘సీజన్‌5’ ఫుల్‌జోష్‌తో, కంటెస్టెంట్‌ల మధ్య హోరాహోరీ పోరుతో సాగుతోంది. వీకెండ్‌లో అటు హౌస్‌మేట్స్‌తో పాటు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు నాగార్జున. ఈసారి ఆ సందడి రెట్టింపు కానుంది. యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ షోకు విచ్చేసి సందడి చేశారు. స్టేజ్‌పై ఆయన్ను చూడగానే హౌస్‌మేట్స్‌ అందరూ లేచి నిలబడ్డారు. దీంతో నాగార్జున ‘గుర్తుపెట్టుకుంటా.. నేను వస్తే ఎవరూ లేవలేదు’ అంటూ సరదాగా వార్నింగ్‌ ఇచ్చారు. తాను లోబోలాగా డ్రెస్‌ చేసుకుని వచ్చానంటూ చరణ్‌ అనడంతో నవ్వులు పూశాయి. మరి హౌస్‌మేట్స్‌ గురించి రామ్‌చరణ్‌కు నాగార్జున ఏం చెప్పారు? చరణ్‌తో కలిసి నటిస్తానన్నది ఎవరు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!





Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని