అలరిస్తున్న జాన్వీ ‘నాదియాన్‌ పార్‌’ - nadiyon paar full song roohi janhvi kapoor
close
Published : 02/06/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తున్న జాన్వీ ‘నాదియాన్‌ పార్‌’

ఇంటర్నెట్‌ డెస్క్: రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాని జియో స్టూడియోస్, మడోక్‌ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. చిత్రం ఈ ఏడాది మార్చి 11న విడుదలై ఆకట్టుకుంది. హారర్‌, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ నటన ప్రధాన ఆకర్షణ. తాజాగా ఈ చిత్రంలోని ‘నాదియాన్‌ పార్‌’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో వచ్చేసింది. ఈ పాటకి ఐపీ సింగ్‌, జిగర్‌ సారయ్యలు సాహిత్యం అందించగా షమూర్, రష్మీత్ కౌర్, ఐపి సింగ్, సచిన్- జిగర్ ఆలపించారు. ఇందులో వరుణ్‌ శర్మ, మానవ్‌ విజ్‌, సరితా జోషి, సుమిత్‌ గులాటీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దినేష్‌ విజన్‌, మృఘ్‌దీప్‌ సింగ్‌ లంబా నిర్మాతలు. సచిన్‌-జిగర్‌ సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని