మహేశ్‌బాబు వీరాభిమానిగా నాగచైతన్య..! - naga chaitanya to be play a dieheart fan of maheshbabu in thankyou movie
close
Updated : 08/03/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబు వీరాభిమానిగా నాగచైతన్య..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది తమ అభిమాన హీరోను థియేటర్లలో చూడలేకపోతున్నామని బాధపడుతున్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు ఓ చిన్న శుభవార్త. ఇంతకీ ఏంటా వార్త అని ఆలోచిస్తున్నారా..? అక్కినేని నాగచైతన్య-విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో ‘థాంక్‌ యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు దిల్‌రాజు నిర్మాత. కాగా.. ఈ సినిమా గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. చిత్రంలో హీరో నాగచైతన్య టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు వీరాభిమానిగా కనిపించనున్నాడట.

సినిమా చిత్రీకరణలో భాగంగా మహేశ్‌బాబు కటౌట్‌కు చైతన్య పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి లీక్‌ అయింది. అది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అందులో ‘ఒక్కడు’ సినిమా పోస్టర్‌ కూడా కనిపిస్తోంది. ఈ వార్త తెలియడంతో అటు మహేశ్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు ఇటు అక్కినేని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. మహేశ్‌బాబు కటౌట్‌కు పాలాభిషేకం చేసే సీన్‌కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

కాగా.. మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పరుశురామ్‌ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని