‘నమస్తే సేట్ జీ’ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ - namaste setji movie poster
close
Published : 16/10/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నమస్తే సేట్ జీ’ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్‌: జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన తల్లాడ వెంకన్న సినీ పరిశ్రమలోనూ మంచి విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నమస్తే సేట్‌జీ’. సాయికృష్ణ, మోనా గుజరాతీ, తల్లాడ వెంకన్న, జయ నాయుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా చిత్ర నూతన పోస్టర్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ వెంకన్న నటిస్తున్న ‘నమస్తే సేట్‌జీ’  అందరికీ నచ్చాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నో అవార్డులు అందుకున్న డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ చేస్తున్న ఈ సినిమా సినీ ప్రముఖుల్ని ఆకర్షించాలని ఆకాంక్షించారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఫ్రంట్‌ లైన్ వారియర్స్ చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న పోలీస్‌లుక్‌ను విడుదల చేసిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యటక శాఖ అభివృద్ధి ఛైర్మన్‌ ఉప్పుల శ్రీనివాస్ గుప్త, స్థానిక నాచారం కార్పొరేటర్ సాయజేన్ శాంతి, నాచారం ఐఏఎల్‌ఏ ఛైర్మన్‌ మహిపాల్ రెడ్డి, క్లాసిక్ గ్రూప్స్ డైరెక్టర్ తల్లాడ సునీల్‌లు, ప్రముఖ రచయిత దాచేపల్లి దేవేందర్ గుప్త,రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై మహంకాళి దివాకర్, తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సునీల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఆర్‌ఏ ప్రదీప్, రామ్ తవ్వ సంగీతం అందిస్తుండగా, శివ కాకు, రమేష్ కుమార్ వేలుపుకొండలు కథ అందించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని