సుశాంత్‌ కేసు.. 33 మంది పేర్లతో ఛార్జిషీట్‌! - ncb to file 30000 page chargesheet in sushant singh rajput drugs case today
close
Updated : 05/03/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ కేసు.. 33 మంది పేర్లతో ఛార్జిషీట్‌!

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతికి సంబంధించి డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ (నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. 33 మంది పేర్లతో ప్రత్యేక కోర్టుకు ఎన్‌సీబీ ఛార్జిషీట్‌ సమర్పించింది. 200 మంది సాక్షుల వాంగ్మూలాలను ఇందులో జోడించింది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేసే పలువురు వ్యక్తుల పేర్లు కూడా ఈ ఛార్జిషీట్‌లో నమోదు చేసినట్లు సమాచారం.

గతేడాది జూన్‌లో తన నివాసంలో సుశాంత్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్‌ కోణంలోనూ విచారణ చేపట్టారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడితోపాటు పలువురుని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్‌ అగ్ర నటీనటులు, దర్శక నిర్మాతల పేర్లు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని