దాడికి ప్రతిదాడి కావాలంటే సిద్ధం: పవన్‌ - pawan kalyan tour in chittoor district
close
Published : 05/12/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాడికి ప్రతిదాడి కావాలంటే సిద్ధం: పవన్‌

శ్రీకాళహస్తి:  రైతు సమస్యలపై పోరాటం చేసేందుకు వచ్చిన జనసేనను వైకాపా అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో ఆయన పర్యటించారు. 

భారీ వర్షం కురుస్తున్నా తడుస్తూనే తుపాను ప్రభావిత రైతులను పరామర్శించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ....తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం రూ.35వేల పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. పోయ గ్రామంలో తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకుల తీరును పవన్‌ తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా వైకాపా జాగీరు కాదన్న జనసేనాని.. రైతుల సమస్యలపై వారికి అండగా ఉండేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్నారు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్న పవన్‌... జనసేన కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధమని ప్రకటించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని