పవన్‌ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు - police denied permission to pawan tour
close
Published : 09/01/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు. పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  

తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి లేదని తొలుత జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందనే అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. అనంతరం పవన్‌ స్పందించారు. తుని పర్యటన కోసం రేపు రాజమండ్రి వస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నాదెండ్ల మనోహర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో పవన్‌ రేపటి తుని పర్యటనపై ఉత్కంఠ వీడినట్లయింది. 

ఇవీ చదవండి..

నిమ్మగడ్డతో అధికారుల బృందం భేటీ

అక్క ఆరోగ్యం బాగాలేదు: భూమా మౌనికమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని