బాహుబలి: ది బిగినింగ్‌కు ఆరేళ్లు! - prabhas celebrates 6 years of baahubali raises a toast to the team that created waves
close
Published : 10/07/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాహుబలి: ది బిగినింగ్‌కు ఆరేళ్లు!

ఇన్‌స్టాలో ఆనందాన్ని పంచుకున్న ప్రభాస్‌

అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కేవలం భారతదేశం వరకే పరిమితం. 2015లో వచ్చిన ‘బాహుబలి’ ఆ సరిహద్దులను చెరిపేసింది. తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జులై 10న విడుదలై... ఈరోజుతో ఆరేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ప్రభాస్‌.. ‘బాహుబలి’తో తన అనుబంధాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సినిమారంగంలో మాయాజాల తరంగాలను సృష్టించింది’’ అంటూ ఆ చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.

ప్రభాస్‌ పోస్టును నటులు రానా, అనుష్క, తమన్నా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టి బహుబలిని గుర్తుచేసుకున్నారు. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌, శివగామిగా రమ్యకృష్ణ ఆ చిత్రానికి ప్రాణం పోశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. జాతీయ ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగానికి ఉత్తమ పురస్కారం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా నిలవడం మరో విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని