గిల్‌ వెనకే షా: వేచి చూడక తప్పదు! - prithvi shaw is in queue says vvs laxman
close
Published : 24/03/2021 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిల్‌ వెనకే షా: వేచి చూడక తప్పదు!

వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంచనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ ఓపెనర్‌ పృథ్వీషా టీమ్‌ఇండియాలో చోటు కోసం మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఇప్పటికే జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారని పేర్కొన్నారు. శుభ్‌మన్‌ గిల్‌ ఉండటంతో షా వరుసలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. విజయ్‌ హజారేలో ముంబయిని విజేతగా నిలిపిన అతడిపై ప్రశంసలు కురిపించారు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన షా విఫలమయ్యాడు. అతడి స్థానంలో తుది జట్టులో చోటు సంపాదించుకున్న శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. జట్టుకు శుభారంభాలు అందించాడు. బ్యాటింగ్‌లో తన పొరపాట్లు సవరించుకున్న షా దేశవాళీ క్రికెట్లో రాణించాడు. విజయ్‌ హజారేలో 8 మ్యాచుల్లో 165.40 సగటుతో 827 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు బాదేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

‘విజయ్‌ హజారేలో పృథ్వీషా అదరగొట్టాడు. సారథిగా ముంబయికి ట్రోఫీ అందించాడు. టీమ్‌ఇండియా వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడే. అయితే గొప్ప ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లందరినీ సెలక్టర్లు వరుసలో ఉంచుతున్నారు. షా ఇప్పుడా వరుసలో గిల్‌ తర్వాత స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గిల్‌ రాణించాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఓపెనర్లు రాహుల్‌, ధావన్‌, రోహిత్‌ జట్టులో ఉన్నారు. జట్టులో ముగ్గురు, నలుగురు ఓపెనర్లకే అవకాశం ఉంటుంది’ అని లక్ష్మణ్‌ అన్నారు.

‘పృథ్వీ షాకు కచ్చితంగా అవకాశం వస్తుంది. అతడు తన బ్యాటింగ్‌ టెక్నిక్‌ను సరిచేసుకొని ఆకట్టుకున్నాడు. కేవలం ప్రదర్శనలే కాదు బ్యాటింగ్‌ సమస్యలనూ అతడు విజయ్‌ హజారేలో అధిగమించాడు. నిలకడగా రాణించాడు. అతడో మ్యాచ్‌ విజేత. అతడికి అవకాశం వస్తుందనడంలో సందేహం లేదు’ అని వీవీఎస్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని