స్టార్‌ హీరో చిత్రంలో అతిథిగా రెహమాన్‌ - rehman cameo appearance in malayam film
close
Published : 22/03/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టార్‌ హీరో చిత్రంలో అతిథిగా రెహమాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ తెర వెనకే ఉంటూ తన సంగీతంతో శ్రోతల్ని ఉర్రూతలూగించే ఎ.ఆర్‌. రెహమాన్‌ తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. త్వరలోనే తనలోని నటుడ్ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా బి. ఉన్నికృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న ‘ఆరాట్టు’ చిత్రంలో నటిస్తున్నారు రెహమాన్‌. ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా అభిమానులతో పంచుకున్నారు మోహన్‌లాల్‌. ఈ మేరకు సెట్లో రెహమాన్‌, దర్శకుడితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘అరుదైన, ఎప్పటికీ గుర్తుండిపోయే షూట్‌ ఇది’ అని పేర్కొన్నారు.  

యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ నాయిక. హిప్పో ప్రైమ్‌ మోషన్‌ పిక్చర్స్‌, మూవీ పే మీడియాస్‌ ఆర్డీ ఇల్యుమినేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మధ్యనే వచ్చిన తమిళ చిత్రం ‘బిగిల్‌’లోని ఓ పాటలో తళుక్కున మెరిశారు రెహమాన్. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని