వేసవి కానుకగా పబ్లిక్‌లోకి ‘రిపబ్లిక్‌’ - republic into public from june 4th 2021
close
Published : 01/02/2021 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేసవి కానుకగా పబ్లిక్‌లోకి ‘రిపబ్లిక్‌’

 ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సోలోబ్రతుకే సో బెటర్’ ఇచ్చిన విజయంతో మంచి ఊపు మీదున్నారు మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌. ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ వంటి ప్రయోగాత్మక సినిమాలతో తన సత్తా చాటిన డైరెక్టర్‌ దేవకట్ట దర్శకత్వంలో ఈ సుప్రీంస్టార్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం ‘రిపబ్లిక్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. తాజాగా చిత్రబృందం ఓ శుభవార్త చెప్పింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వేసవి కానుకగా 2021 జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది.

కరోనా తర్వాత అందరికంటే ముందుగా థియేటర్‌లో తన సినిమా విడుదల చేసి సఫలమయ్యారు సాయిధరమ్‌తేజ్‌. ఈ ఏడాదిలోనే మరో సినిమాతో అలరించనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, కీలక పాత్రల్లో నటించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఇవీ చదవండి..

‘మెగా’ మూవీస్‌.. ఆమె చుట్టే గాసిప్స్‌!

‘నారప్ప’ పని పూర్తయింది!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని