గడ్డమే తేడా.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌: యువీ - same innocence same looks says yuvi
close
Published : 06/08/2020 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గడ్డమే తేడా.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌: యువీ

అదొక్కటే అంటావా పాజీ: భజ్జీ కవ్వింపులు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కలివిడిగా ఉంటారు. సోదరభావంతో మెలుగుతారు. అప్పుడప్పుడు ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటారు. ‌తాజాగా సోషల్‌ మీడియాలో యువీ పంచుకొన్న ఓ చిత్రానికి భజ్జీ కవ్వించేలా బదులిచ్చాడు.! 

‘చూస్తుంటే గడ్డం తప్ప పెద్దగా ఏమీ మారినట్టు లేదు! ముఖంలో అదే నిష్కపటం, అవే అమాయక చూపులు. మీరేమంటారు?’ అని యువరాజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుత, బాల్యంలోని చిత్రాలు పెట్టాడు. దీనికి ‘నిజమేనా పాజీ. గడ్డం మాత్రమే అంటావా??’ అని భజ్జీ టీజ్‌ చేశాడు. పనిలో పనిగా 1996/7 అండర్‌-19 ప్రపంచకప్‌, ఇప్పటి చిత్రాలను ఇన్‌స్టాలో పెట్టాడు. ‘నువ్వు పొందిన అన్నిటికీ కృతజ్ఞతగా ఉండు. నువ్వింకా పొందాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని తక్కువగానే అందుకోవాల్సింది’ అని ఓ వ్యాఖ్య జత చేశాడు.

వీడ్కోలు తర్వాత యువరాజ్‌ సింగ్ విదేశాల్లో టీ20 లీగులు ఆడుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా అన్నీ వాయిదా పడటంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. యూవీకెన్‌‌ ఫౌండేషన్‌ పనులు చూసుకుంటున్నాడు. మొహాలిలో పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో శుభ్‌మన్‌ గిల్‌ వంటి యువ క్రికెటర్లతో తన అనుభవాన్నీ పంచుకుంటున్నాడు. ఇక హర్భజన్‌ సింగ్‌ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌-2020కి సిద్ధమవుతున్నాడు. ఇంటి వద్దే సాధన చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్‌కు సేవలందించిన ఈ వెటరన్‌ స్పిన్నర్‌ ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్నాడు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని