వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండి - sc directs private hospitals to give priority in treatment to elderly amid pandemic
close
Published : 04/03/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ: వృద్ధులు కరోనా కారణంగా ఇబ్బంది పడకుండా వారికి ఆస్పత్రుల్లో ప్రాధాన్యమిచ్చి చికిత్సను అందించాలని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. వృద్ధులు ఏ సమస్యతో వచ్చినా వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఆగస్టు 4, 2020న ఇచ్చిన  తీర్పులో మార్పులు చేస్తూ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్.ఎస్.రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. గతంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

వయసు పైబడిన వారికి కరోనా ముప్పు అధికంగా ఉన్న నేపథ్యంలో న్యాయవాది అశ్వని కుమార్‌ వేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేసింది. వృద్ధుల అనారోగ్యాలు, సాధారణ చెకప్‌లకు వైద్యశాలల్లో ప్రాధాన్యతనివ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ అంశంపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న చర్యలను తెలపాలని సుప్రీం ఆదేశించగా కేవలం ఒడిశా, పంజాబ్‌లు మాత్రమే స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు మూడు వారాల్లోగా తాము తీసుకున్న చర్యలు తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది. వృద్ధులకు ఈ సమయంలో ప్రాధాన్యత నివ్వడం చాలా అవసరమని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాష్ట్రాలకు న్యాయస్థానం ఎస్‌వోపీలు పంపాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు మందులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని