‘డి 43’ మొదలయ్యేది అప్పుడే - shooting details of dhanush next movie
close
Published : 17/05/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డి 43’ మొదలయ్యేది అప్పుడే

తమిళ కథానాయకుడు ధనుష్‌ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘జగమే తందిరం’, ‘అత్రాంగి రే’ చిత్రాలతో పాటు ‘ది గ్రే మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇది ‘డి 43’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు దర్శకుడు కార్తిక్‌ తెలియజేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. ‘డి 43’ చిత్ర విషయమై స్పష్టత ఇచ్చారు. ‘‘ధనుష్‌ చేస్తున్న ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే మా ‘డి 43’ని సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఇందులో నటుడు మహేంద్రన్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి’’ అని కార్తిక్‌ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా మాళవికా మోహన్‌ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని