కన్నడ ‘సీడీ లేడీ’సినిమా! - sleaze cd case kannada film producer books cd lady title
close
Published : 23/03/2021 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నడ ‘సీడీ లేడీ’సినిమా!

బెంగుళూరు: కర్నాటక రాజకీయాల్లో కలకలం సృష్టించిన ‘సీడీ ఎపిసోడ్‌’ గురించి తెలిసిందే. కర్నాటక మంత్రి రమేశ్‌ జార్ఖిహోళి ఈ వివాదంలో ఒక మహిళకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్టు ఆరోపణలు ఎదర్కొంటున్నారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే కథా నేపధ్యం ఇదో కాదో తెలియదు కానీ సినీ నిర్మాత, ప్రతిపక్ష జేడీ-ఎస్‌ నాయకుడు సందేశ్‌నాగరాజ్‌ ‘సీడీ లేడీ’అనే టైటిల్‌ను కన్నడ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో రిజిస్టేషన్‌ చేయించారు. ప్రస్తుతానికైతే ఆ చిత్రం కథగానీ, డైరెక్టర్‌ ఎవరన్నది కానీ నిర్ణయించుకోలేదన్నారు. తాము తీయబోయే చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని మాత్రం వెల్లడించారు. గతంలో ఈయన ‘ఐరావత, ప్రిన్స్‌, మన్నిన ధోని, అమర్‌’ చిత్రాలను నిర్మించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని