కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే: తమిళిసై - tamilisai participated in abdul kalam death annivarsary
close
Published : 28/07/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే: తమిళిసై

హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే దేశానికి, యువతకు ఎంతో మేలు జరిగేదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. కలాం వర్థంతి సందర్బంగా ఏపీజే కలాం అంతర్జాతీయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. సహనశీల సుందర సమాజ నిర్మాణమే కలాంకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. శ్రమను, కృషిని అబ్దుల్‌ కలాం ఎంతో గౌరవించేవారని చెప్పారు. కలాం రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం దేశానికి, యువతకు తీరని అన్యాయమని పేర్కొన్నారు. కలాం విజన్‌, లక్ష్యాలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గవర్నర్‌ చెప్పారు. 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని