A1 Express: ‘తెల‌వారుతుంటే’ గీతం వ‌చ్చేసింది - telavarutunte song from a1 express
close
Published : 26/05/2021 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 A1 Express: ‘తెల‌వారుతుంటే’ గీతం వ‌చ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. హాకీ నేప‌థ్యంలో డేనియస్‌ జీవన్‌ కనుకొలను  తెర‌కెక్కించారు. తాజాగా ఈ సినిమాలోని  ‘తెలవారుతుంటే’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ విడుద‌లైంది. నాయిక లావ‌ణ్య పొద్దునే లేచి హాకీ ప్రాక్టీస్ కోసం వెళ్లే సంద‌ర్భంలో వ‌చ్చే గీత‌మిది. అదే స‌మ‌యంలో  ఆమెని ప‌రిచ‌యం చేసుకునేందుకు సందీప్ ప్ర‌య‌త్నిస్తుంటాడు. లొకేష‌న్లు, నాయ‌కానాయిక‌ల హావ‌భావాలు ఆక‌ట్టుకుంటున్నాయి. కిట్టు విస్సాప్ర‌గ‌డ ర‌చించిన ఈ గీతాన్ని సుస్వ‌రం అనిరుధ్ ఆల‌పించారు. హిప్ హాప్ త‌మిళ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం  ప్రముఖ ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో  స్ట్రీమింగ్ అవుతోంది. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని