Cinema News: మధురపూడి కథ - telugu news First look of madhurapudi Gramam Ane Nenu Launched By Director Harish Shankar
close
Updated : 20/10/2021 06:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: మధురపూడి కథ

శివ కంఠమనేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్‌ శంకర్‌రావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. ‘‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మధురపూడి గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరి ప్రత్యేకత ఏమిటి? ఆ ఊళ్లోని కొన్ని పాత్రల కథేమిటన్నది తెరపై చూడాల్సిందే.  కల్యాణ్‌రామ్‌తో ‘కత్తి’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మల్లి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సురేష్‌ భార్గవ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని