మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై రాళ్లదాడి - telugu news attack on devineni uma vehicle
close
Updated : 27/07/2021 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై రాళ్లదాడి

జి.కొండూరు: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు రాళ్లదాడికి దిగారు.  కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద  వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమైనట్టు సమాచారం. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. తెదేపా, వైకాపా వర్గాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉమా వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి దేవినేని ఉమాకు చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని,  వైకాపా నేతల అక్రమాలపై పోరాడేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని