Akhanda: సెట్‌ ఫిక్సైంది.. బాలయ్య సినిమా క్లైమాక్స్ షురూ అయ్యింది..! - telugu news balakrishna starer akhanda climax shoot starts today
close
Published : 23/07/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhanda: సెట్‌ ఫిక్సైంది.. బాలయ్య సినిమా క్లైమాక్స్ షురూ అయ్యింది..!

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ కోసం చిత్రబృందం లొకేషన్స్‌ వేటలో పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో క్లైమాక్స్ చిత్రీకరణ చేసేందుకు నిర్ణయించుకుంది. కాగా, శుక్రవారం ఉదయం క్లైమాక్స్‌ షూట్‌ షురూ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ఫొటోని అందరితో పంచుకుంది. ఇందులో బాలయ్యకు సీన్‌  వివరిస్తూ బోయపాటి కనిపించారు. స్టంట్‌ మాస్టర్‌ శివ నేతృత్వంలో జరగనున్న ఈ షూట్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు.

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన వేరియేషన్స్‌లో కనిపించనున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని