RakulPreet Singh: కన్నీటి పర్యంతమైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ - telugu news i cried out of joy says rakul preet singh
close
Updated : 26/08/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RakulPreet Singh: కన్నీటి పర్యంతమైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ఇన్‌స్టాలో ఏం పోస్ట్‌ చేశారంటే..

హైదరాబాద్‌: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఈ బ్యూటీ బిజీ లైఫ్‌ నుంచి చిన్న విరామం తీసుకుని.. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్‌లో సినిమా చూశారు. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘బెల్‌బాటమ్‌’ వీక్షించిన రకుల్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.

చాలా నెలల తర్వాత థియేటర్‌లో సినిమా చూడటం ఆనందంగా ఉందని.. స్క్రీన్‌పై టైటిల్స్‌ ప్రారంభంకాగానే భావోద్వేగానికి గురయ్యానని.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ థియేటర్‌లో సినిమా విడుదల చేసిన అక్షయ్‌కుమార్‌తోపాటు ‘బెల్‌బాటమ్‌’ చిత్రబృందం మొత్తాన్ని ఆమె అభినందించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చేతిలో ఆరడజనకు పైగా ప్రాజెక్ట్‌లున్నాయి. తెలుగులో ‘కొండపొలం’, తమిళంలో ‘భారతీయుడు-2’, ‘అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌’, ‘అయలాన్‌’తోపాటు బాలీవుడ్‌లో ‘ఎటాక్‌’, ‘మేడే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జీ’ వంటి సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని