Telugu Songs: ‘కిన్నెరసాని’ నుంచి ఊరి పాట..జోర్‌ సే ‘రిపబ్లిక్‌’ - telugu news latest songs from republic kinnerasani saidhram tej kalyan dhev
close
Published : 28/09/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Telugu Songs: ‘కిన్నెరసాని’ నుంచి ఊరి పాట..జోర్‌ సే ‘రిపబ్లిక్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయిధరమ్‌ తేజ్ హీరోగా దేవ కట్టా రూపొందించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘జోర్‌ సే’ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. సాయిధరమ్‌ తేజ్ డ్యాన్స్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన లిరికల్‌ వీడియో శ్రోతల్ని విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. సుద్దాల అశోక్‌ తేజ రచించిన ఈ పాటని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టరుగా కనిపించనున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు.

పార్వతీపురం పాట..

కల్యాణ్ దేవ్‌ కథానాయకుడిగా రమణ్‌ తేజ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కిన్నెరసాని’. శీతల్‌ కథానాయిక. ఈ సినిమాలోని ‘పార్వతీపురం’ అనే పాటని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటకి మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు. ఉమానేహా ఆలపించారు. రేవంత్‌, ధనుంజయ్‌ కోరస్‌ ఇచ్చారు. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నల్లుడు ఈ కల్యాణ్‌దేవ్‌. ‘విజేత’ చిత్రంతో నటుడిగా మారారు. 





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని