ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మ వంచన: కేటీఆర్‌ - telugu-news-minister ktr chit chat with media in hyderabad
close
Updated : 14/07/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మ వంచన: కేటీఆర్‌

హైదరాబాద్‌: భాజపా నేత ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని.. ఆత్మ వంచన అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఈటల.. తాను మోసపోతూ ప్రజలనూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు తెరాస ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉంటూనే కేబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టారన్నారు. ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఇలా చేసిన తర్వాత ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందో చెప్పాలన్నారు. ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు మంత్రిగా కొనసాగారు? అని నిలదీశారు. ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా మంత్రిగా ఉంచారని గుర్తు చేశారు. ఈటల తెరాసలో కొనసాగేలా చివరివరకు ప్రయత్నిచానని కేటీఆర్‌ వెల్లడించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ప్రజలకు తెరాస ఏం అన్యాయం చేసిందని పాదయాత్ర చేపట్టారు? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికైనా పార్టీల మధ్యే.. వ్యక్తుల మధ్య కాదన్నారు. హుజూరాబాద్‌లో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని