MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణునే కరెక్ట్‌: బాబు మోహన్‌  - telugu news mohan babu speech maa elections manchu vishnu
close
Published : 24/09/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణునే కరెక్ట్‌: బాబు మోహన్‌ 

హైదరాబాద్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణునే సరైనవాడని, ఆయన్ను గెలిపించాలని కోరారు సీనియర్ నటుడు బాబూ మోహన్‌. విష్ణు ప్యానెల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబూ మోహన్‌ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేది. మహామహులతో కళకళలాడేది. పెద్దదిక్కులాంటి వారు వెళ్లిపోయాక, ఇండస్ట్రీ దిక్కులేకుండా అయిపోతుందని నాకు అనిపించింది. ఒకానొక సందర్భంలో విమానంలో ప్రయాణిస్తుండగా ‘మా’ గురించి ఆలోచన మొదలైంది. అనుకున్న వెంటనే ప్రారంభమైంది. మొదట్లో బాగుండేది. తర్వాతర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు పోటీ చేస్తున్న మరో ప్యానెల్‌ ప్రెసిడెంట్‌.. మా ప్యానెల్‌కి సంబంధించి వారు ఇలా, వీరు అలా అనడం ఎంతవరకూ భావ్యం? ఈ విషయంలో నాకు బాధ కలిగింది. ఆయన అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘మా’కి అధ్యక్షుడిగా క్రమశిక్షణ కలిగిన మంచు విష్ణు సరైనవాడు. ఆయన్ను గెలిపించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

ఇదే ప్యానెల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న మాదాల రవి మాట్లాడుతూ... ‘ప్రజలను చైతన్య పరుస్తూ, వినోదం అందించేది కళాకారులు. వీరి కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కి ప్రెసిడెంట్‌గా గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో సేవ చేశారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మా (మంచు విష్ణు) ప్యానెల్‌ ఉద్దేశం. నేను గత 14 ఏళ్లుగా ‘మా’కి సంబంధించిన అన్ని సభలకీ హాజరయ్యాను. మోహన్‌బాబు గారు ఫోన్‌ చేశారని, విష్ణు అడిగారని నేను ఇప్పుడు ‘మా’లోకి రాలేదు. విష్ణు చెప్పిన విధివిధానాలు నాకు బాగా నచ్చాయి. విజనరీ ఉన్న వ్యక్తి అని అర్థమైంది’.

‘ప్రకాశ్‌రాజ్‌ చాలా గొప్ప నటుడు. అలాంటి ఆయన్ను మీరు నాన్‌ లోకల్‌ అనడం తప్పు. కళాకారులకి హద్దులేవు. ప్రపంచమంతా మనదే. ఇక్కడ సేవ ఎవరైనా చేయొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు విన్నా. మేనిఫెస్టో చూశా. చాలా స్ఫూర్తిపొందా. కానీ, నాకు అందులో కొన్ని తప్పులు కనిపించాయి. గత 14 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఓటేయడానికి వచ్చారా? మీ కోసం 900మంది వచ్చి ఓటెందుకు వేయాలి? అగ్ర హీరోలు, మహానటుల వల్ల ‘మా’ ముందుకు కదులుతోంది. అలాంటిది వారందరినీ ముందుకునెట్టి పనిచేయిస్తాననడం ఎంతవరకు సమంజసం. ఒక వర్కింగ్‌ ప్యానెల్‌ ఉండగా, అందులోని సభ్యుల కాలపరిమితి అవ్వకుండానే మీ ప్యానల్‌లోకి తీసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టడం ధర్మమా? ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక కదా ఇది చేయాల్సింది. మరి ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది’ అని ప్రశ్నించారు. ‘ఎవరు గెలిచినా, ఓడినా ‘మా’ని మరోస్థాయికి తీసుకెళ్దాం’ అని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని