Nara Lokesh: త్వరలోనే ‘రిపబ్లిక్‌’ చిత్రాన్ని చూస్తా: లోకేశ్‌ - telugu news nara lokesh about republic movie
close
Published : 03/10/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nara Lokesh: త్వరలోనే ‘రిపబ్లిక్‌’ చిత్రాన్ని చూస్తా: లోకేశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రిపబ్లిక్‌’ రివ్యూల గురించి వింటున్నానని, త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘‘రిపబ్లిక్‌’ సినిమా గురించి మంచి రివ్యూలు వస్తున్నాయి. వాటి గురించి వింటున్నా. త్వరలోనే ఈ సినిమాని చూస్తా. చికిత్స పొందుతోన్న సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 1న విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్‌ సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టరుగా నటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని