Sridevi Drama Company: ఈ కామెడీని తట్టుకోవడం కష్టమే! - telugu news sridevi drama company latest promo etv
close
Published : 02/08/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sridevi Drama Company: ఈ కామెడీని తట్టుకోవడం కష్టమే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకులకి వినోదం పంచే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ షో ఎప్పటిలానే తదుపరి ఎపిసోడ్‌ని నవ్వులతో నింపేసింది. ఆగస్టు 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. వీడియో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ‘తగ్గేదే ల్యా’ అన్నట్టు సాగింది. వరుస పంచ్‌లతో కబుపుబ్బా నవ్విస్తోంది. క్లాస్‌ వర్సెస్‌ మాస్‌ వ్యక్తుల మధ్య రైలు ప్రయాణం ఎలా ఉంటుందో చూపించిన తీరు అలరిస్తోంది. ఈ ప్రయాణంలో రాం ప్రసాద్‌, గెటప్‌ శ్రీను మధ్య వచ్చే సంభాషణలు వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే! మరో సందర్భంలో  ‘ఈ రూ.2000 నోటు చెల్లదురా’ అంటూ గెటప్‌ శ్రీను అనగానే ‘అది అక్కది చెల్లిది కాదు’ అని ప్రసాద్‌ సందడి చేశాడు. మ ఇదంతా చూస్తే ‘ఈ కామెడీని తట్టుకోవడం కష్టమే’ అని మీకూ అనిపిస్తుంది. గెటప్‌ శ్రీను స్ఫూర్తినిచ్చే గీతంతో ఆకట్టుకున్నాడు. కరోనా సమయంలో టాలీవుడ్‌ హీరోలు చేసిన సాయాన్ని తెలియజేశాడు. ‘సాయానికి ప్రచారం లేకపోయినా దాని గురించి సమాచారం ఇస్తే వేరే వాళ్లకి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని