Cinema News: 13 హారర్‌ చిత్రాలు చూస్తే రూ. 95,500 బహుమతి - telugu news us based compay will pay to wath horror films
close
Published : 16/09/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: 13 హారర్‌ చిత్రాలు చూస్తే రూ. 95,500 బహుమతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మా హారర్‌ చిత్రాన్ని ఒంటరిగా చూస్తే ఫలానా బహుమతి ఇస్తాం’ అని ఆయా చిత్రబృందాలు అప్పుడెప్పుడో ప్రకటించే సంగతి తెలిసిందే. ఇలాంటి అవకాశాన్నే అందించేందుకు సిద్ధమైంది అమెరికాకు చెందిన ఫినాన్స్‌ బజ్‌ కంపెనీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన భయానక చిత్రాలకే ఆదరణ లభిస్తుందా? తక్కువ వ్యయంతో రూపొందిన ఉత్కంఠభరిత సినిమాల పరిస్థితి ఏంటి? అనే సర్వే నిర్వహించనుంది. ఇందులో భాగంగా ‘హారర్‌ మూవీ హార్ట్‌రేట్‌ అనలిస్ట్‌’ కోసం ఓ పరీక్ష పెట్టనుంది. ఈ మేరకు 13 హారర్‌ చిత్రాల్ని ఎంపిక చేసింది. సదరు పోటీదారులు ఫిట్‌బిట్‌ ధరించి ఈ సినిమాల్ని వీక్షించాలి. అలా ఎవరైతే ఈ హారర్‌ చిత్రాల్ని చూసి ధైర్యంగా ఉంటారో వారికి ఫినాన్స్‌ బజ్‌ 1300 డాలర్లు (రూ.95,500) అందించనుంది. కేవలం అమెరికా పౌరులకి మాత్రమే ఈ అవకాశం ఉంది.

సినిమాల జాబితా ఇది..

* సా

అమిటివిల్లే హారర్‌

* ఏ క్వైట్‌ ప్లేస్‌

* ఏ క్వైట్‌ ప్లేస్‌ పార్ట్‌ 2

* క్యాండిమ్యాన్‌

* ఇన్సిడియోస్‌

ది బ్లెయిర్‌ విచ్‌ ప్రొజెక్ట్‌

* సినిస్టర్‌

* గెట్‌ఔట్‌

* ది పర్గ్‌

* హాలోవీన్‌ 

* పారానార్మల్‌ యాక్టివిటీ

* అనబెల్లె



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని