vijayasaireddy: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: విజయసాయిరెడ్డి - telugu news: cbi court hearing on jagan illegal assets case
close
Updated : 09/09/2021 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vijayasaireddy: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో గురువారం జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. మొదట ఈడీ కేసులు విచారణ జరపాలన్న తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి  మెమోపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యంతరం తెలిపింది. విజయసాయిరెడ్డి గత మూడు వాయిదాల్లో ఇదే విషయం చెబుతున్నారని, అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదుపై వాదనల కోసం విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. 

ఇండియా సిమెంట్స్‌ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి  డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. జగన్‌, విజయసాయి పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. శామ్యూల్‌ను ఛార్జిషీట్‌ నుంచి తొలగించవద్దని కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. సీబీఐ కోర్టులో ఓబుళాపరం గనుల కేసు విచారణ కూడా జరిగింది. డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి కోర్టు స్పష్టం చేసింది. అభియోగాల నమోదుపై లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 13కి వాయిదా పడింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని