ఏదో రోజు కోహ్లీ వీడ్కోలు పలకాల్సిందే కదా! - test your future generations says monty panesar
close
Published : 24/12/2020 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏదో రోజు కోహ్లీ వీడ్కోలు పలకాల్సిందే కదా!

యువకులను పరీక్షించాల్సిన సమయమిదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీపై టీమ్‌ఇండియా అతిగా ఆధారపడకూడదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనెసర్‌ అన్నాడు. ఏదో ఒకరోజు అతడికి వీడ్కోలు పలకక తప్పదని గుర్తు చేశాడు. భవిష్యత్తు తారలను పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘మనమిప్పుడు భవిష్యత్తును చూడాలి. భారత క్రికెట్‌ భవితవ్యం ఏంటి? అందుకు ఇదే సరైన సమయం. ఏదో ఒకరోజు విరాట్‌ వీడ్కోలు పలకక తప్పదు. అందుకే ప్రతిసారీ టీమ్‌ఇండియా అతడిపైనే ఆధారపడకూడదు. ఇతరులు బాధ్యత తీసుకోవాలి. విరాట్‌ లేకుండా భారత క్రికెట్‌ పరిస్థితి ఏంటో చూడాలి. ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో ఈ సంగతి తెలుస్తుంది. కోహ్లీ, అజింక్య, రోహిత్‌ వీడ్కోలు పలికాక ఎవరు స్టార్లు అవుతారో చూడాలి. శుభ్‌మన్‌కు ఇదో గొప్ప అవకాశం’ అని పనెసర్‌ అన్నాడు.

‘సిరీసులో ఎవరు గెలుస్తారన్నది నేను చూడటం లేదు. తర్వాత తరం గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు కోహ్లీ, రోహిత్‌ లేరని తెలుసు. అందుకే రెండో టెస్టులో యువకులకు అవకాశాలు ఇవ్వాలి. ఇది వారికి సువర్ణావకాశం. ఐపీఎల్‌లో యువకులు బాగా రాణించారు. కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ టీమ్‌ఇండియా ఆస్తులు. వీరికి అవకాశాలిచ్చి భారత క్రికెట్‌ భవిష్యత్తేంటో తెలుసుకోవాలి. అన్నీ విరాట్‌ ఒక్కడే చేయలేడుగా’ అని మాంటీ తెలిపాడు. శనివారం నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు జరిగే సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
చాహల్‌-ధనశ్రీ.. మధురస్మృతులు
దుమారం రేపిన సన్నీ!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని